తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్ గా నజీర్?

3619చూసినవారు
తెలంగాణ ఇన్‌ఛార్జ్ గవర్నర్ గా నజీర్?
తెలంగాణ గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేందుకు వీల్లేదు. దీంతో నజీర్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్యతల్ని తమిళనాడు గవర్నర్ రవికి ఇవ్వొచ్చని సమాచారం.