నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ లో గల శ్రీశ్రీశ్రీ విశ్వకర్మ భగవాన్ ఆలయంలో ఆదివారం విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే,
బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆలయంలో పూజలు జరిపారు.