హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం భైంసా బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగదేవత ఆలయంలో జరిగిన దొంగతనంపై పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రజలందరూ బంద్కు సహకరించాలని కోరారు.