Feb 02, 2025, 12:02 IST/
TG: నకిలీ విలేఖరుల హల్చల్.. రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ (వీడియో)
Feb 02, 2025, 12:02 IST
నల్గొండ జిల్లాలో నకిలీ విలేఖరులు హల్చల్ చేశారు. క్రైం మిర్రర్ పత్రిక అంటూ నకిలీ విలేఖరుల ముఠా మిర్యాలగూడ ఏరియాలో ఓ సీఐ స్థాయి అధికారిని బెదిరించి రూ.5 లక్షలు వరకు డిమాండ్ చేసి రూ.1.10 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు. మరో రూ 4 లక్షలు ఇవ్వాలంటూ సీఐ కుటుంబానికి టార్చర్ చూపిస్తున్నారు. భాదిత పోలీసు అధికారి ఫిర్యాదుతో నకిలీ విలేఖరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరికొందకి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠాపై గతంలో పలు కేసులున్నట్టు గుర్తించారు.