
కామారెడ్డి: శ్రీలక్ష్మీదేవి అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేట్ గ్రామంలో శ్రీ లక్ష్మి దేవి అమ్మవారి 4వ వార్షికోత్సవంలో మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మిదేవి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి ఆ తల్లి దీవెనలు లభించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.