వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తేనే అసెంబ్లీకి వెళ్తా: జగన్
AP: అసెంబ్లీ సమావేశాలపై గురువారం జగన్ మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి తనను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే అసెంబ్లీకి వెళ్తానని జగన్ తెలిపారు. తమకు 40 శాతం ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తించాలన్నారు. లేకుంటే అసెంబ్లీ ప్రారంభమైన ప్రతి 3 రోజులకు ఒకసారి అధికార పార్టీ చేసిన తప్పులను మీడియా ద్వారా బయటపెడతామన్నారు. సాధారణ సభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లినా ప్రయోజనం లేదని జగన్ పేర్కొన్నారు.