ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. దీనికోసం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ చట్టం వచ్చే 12 నెలల్లో అమల్లోకి రానుంది. కాగా, చట్టసభ సభ్యులు ఆమోదించిన తర్వాత తల్లిదండ్రుల సమ్మతితో పిల్లలకు వయోపరిమితిపై ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది.