నటి జెత్వానీ కేసు.. విజయవాడకు విద్యాసాగర్
ముంబై నటి జెత్వానీ కేసులో వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ను ఆదివారం అర్ధరాత్రిలోపు విజయవాడకు తీసుకొస్తామని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలను పూర్తి చేసి సోమవారం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నటి కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోందన్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారణ జరుగుతుందన్నారు. జెత్వానీకి పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు.