యూపీలో ఘజియాబాద్‌లోని బ్లింకిట్ కిరాణా దుకాణంలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. బ్లింకిట్ కిరాణా డెలివరీ దుకాణంలో పనిచేసే కొందరు యువకులు.. మెయిన్‌పురి నుండి వచ్చిన వారిని దుకాణంలో పని చేయకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణల కారణంగా ఈ వివాదం ఏర్పడింది. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవ్వగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.