Dec 02, 2024, 14:12 IST/
BREAKING: పుష్ప-2పై హైకోర్టులో పిటిషన్
Dec 02, 2024, 14:12 IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప-2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. టికెట్ల రేట్లను భారీగా పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై న్యాయస్థానంలో పిటిషన్ వేయగా.. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, ప్రీమియర్లకు టికెట్ ధరపై రూ.800 పెంచుకునేందుకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. డిసెంబర్ 5-8 వరకు రూ.200, ఆ తర్వాత కూడా పెంపునకు అనుమతి ఇచ్చిన సంగంతి తెలిసిందే.