ఆ ఇద్దరి బాటలో పవన్ కళ్యాణ్!
AP: 2024లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఏపీకి డిప్యూటీ సీఎం అయిన తర్వాత నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇందుకోసం పాలనాపరంగా రాజకీయంగా వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. సొంత నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చంద్రబాబు, జగన్ బాటలోనే పవన్ వెళ్తున్నారు. పిఠాపురంను భవిష్యత్తు కంచుకోటగా మార్చుకోవాలనుకుంటున్నారు. నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు.