AP: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. వృత్తిని రాఘవేంద్ర బాలకుటీర్‌కు చెందిన మొత్తం ఐదుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. అయితే కెనాల్‌లో దిగిన వీరు కొట్టుకుపోవడంతో స్థానికులు గమనించి ముగ్గురిని కాపాడారు. మరో ఇద్దరు కెనాల్‌లో కొట్టుకుపోయారు. వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా.. మరొకరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలిస్తోంది.