Top 10 viral news 🔥
AP: వైద్యం వికటించి ఏడు నెలల పసికందు మృతి
ఏపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి గాంధీనగర్ లిటిల్ స్టార్స్ అండ్ షీ ఆసుపత్రిలో వైద్యం వికటించి ఏడు నెలల పసికందు మృతి చెందింది. చికిత్స నిమిత్తం రూ.20 లక్షలు వసూలు చేసి, అనంతరం పసికందు చనిపోయిందని చెప్పడంతో డాక్టర్లను చిన్నారి బంధువులు నిలదీశారు. మరో రూ.2 లక్షలు కడితేనే పసికందు మృతదేహం ఇస్తామని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తోంది. దీంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.