బర్గర్లతో బ్యాక్టీరియా వ్యాప్తి
మెక్డొనాల్డ్స్ హ్యాంబర్గర్ల ద్వారా అమెరికాలో ఈ.కొలై బ్యాక్టీరియా వ్యాప్తి అవుతున్నది. ఈ నేపథ్యంలో మెక్డొనాల్డ్స్ ఫుడ్ కంపెనీ తమ మెనూ నుంచి ఆ హాంబర్గర్లను తీసి వేసింది. ఇటీవల బర్గర్లు తినడం వల్ల ఓ వ్యక్తి మృతి చెందగా, మరో 49 మంది గాయపడ్డారు. మెక్డొనాల్డ్స్ అమ్ముతున్న క్వార్టర్ పౌండర్ హాంబర్గర్ల ద్వారా ఈ.కొలై బ్యాక్టీరియా వ్యాప్తి అవుతున్నట్లు సీడీసీ గుర్తించింది.