ఏపీలో మరో దారుణం.. టెన్త్ విద్యార్థినిపై అత్యాచారం
ఏపీలోని తిరుపతి జిల్లాలో మరో బాలికపై దారుణం జరిగింది. యర్రావారిపాలెం మండలానికి చెందిన టెన్త్ విద్యార్థిని (14) స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు ఆమెను అడ్డుకున్నారు. మత్తు కలిపిన నీటిని తాగించి పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ములుగుతున్న శబ్ధం విన్న స్థానికులు బాలికను గుర్తించి ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.