కొత్త పింఛన్లకు సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అర్హతను బట్టి కొత్త పింఛన్‌దారులకు 6 నెలలకోసారి పింఛన్ మంజూరు చేయాలని సూచించారు. భర్త చనిపోయిన వారు డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచి ఫించన్ ఇవ్వాలన్నారు. 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానాన్ని డిసెంబర్ నుంచే అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.