600 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 600 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి అప్లికేషన్ విండో ఓపెన్ కానుంది. ఇది 16 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. ప్రిలిమ్స్ పరీక్ష వచ్చే ఏడాది మార్చి 8-15 వరకు జరగనుంది. మెయిన్స్ ఏప్రిల్-మేలో జరిగే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు. వయసు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్, ఓబీసీ, EWS అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.750 కాగా మిగతావారికి ఉచితం.