కజకిస్థాన్‌లో బుధవారం ఘోర విమాన ప్రమాదంలో 38 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ప్రమాదం జరగడానికి ముందు పైలట్ మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. ఉ.8.16 గంటలకు విమానాన్ని పక్షి ఢీకొట్టిందని పైలట్ రాడార్‌కు సమాచారమిచ్చాడు. అయితే విమానాన్ని ఎడమవైపు ఆర్బిట్‌లో నడపాలని చెప్పగా 'నా కంట్రోల్ లో ఏమీ లేదు' అని పైలట్ సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపటికే రాడార్ సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి, ఆ తర్వాత అరగంటకే ప్రమాదం జరిగింది.