26 ఏళ్లుగా అజ్ఞాతంలో.. పెళ్లి పత్రిక పట్టించింది (వీడియో)
శ్రీసత్యసాయి జిల్లా దిన్నేహట్టి గ్రామానికి చెందిన గొల్ల తిప్పేస్వామికి కరియమ్మతో 30 ఏళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. రెండో కొడుకు తనకు పుట్టలేదని పిల్లాడిని చంపి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కర్ణాటకలోని న్యామనహళ్లిలో పేరు మార్చుకుని స్థిరపడ్డాడు. అక్కడే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల తన పెద్ద కుమార్తె పెళ్లి కుదరడంతో దిన్నేహట్టిలోని తన స్నేహితుడికి తిప్పేస్వామి పెళ్లి పత్రిక పంపాడు. 26 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతడిని పట్టుకుని అరెస్ట్ చేశారు.