సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిల్ కొట్టివేత

51చూసినవారు
సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిల్ కొట్టివేత
సుప్రీం కోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చుక్కెదురైంది. పాల్ సహా పలువురు ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్‌ను తిరిగి తీసుకురావాలని పిల్(PIL) దాఖలు చేశారు. ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చన్న వాదనలను పరిగణలోకి తీసుకోలేమని తెలిపింది. ప్రత్యర్థులు గెలిచినప్పుడు ఓడిన వారు ట్యాంపరింగ్ గురించి మాట్లాడుతారని, వారి మాటలను పరిగణలోకి తీసుకోలేమని పిల్ కొట్టివేసింది.

సంబంధిత పోస్ట్