బ్యాలెట్ పేపర్లను వదలని జగన్!
AP: మాజీ సీఎం జగన్ బ్యాలెట్ పేపర్లను వదిలే ప్రశ్నే లేదన్నట్టు పట్టుదల ప్రదర్శిస్తున్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ల పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో మరోసారి ఈవీఎంపై అనుమానాలు, బ్యాలెట్ పేపర్ల ఆవశ్యకత గురించి ప్రస్తావించడం విశేషం. ఈవీఎంలలో గోల్ మాల్ చేస్తున్నారని, దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ల వాడకంపై చర్చ జరగాలని జగన్ డిమాండ్ చేశారు. అయితే ఈవీఎంలను తప్ప, బ్యాలెట్ మాటే వద్దని ఎన్డీఏ నేతలు అంటున్నారు.