డిసెంబర్ 4న నాగ చైతన్య-శోభిత వివాహం జరగనుంది. అయితే పెళ్లి వీడియోను డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై నాగ చైతన్య పీఆర్ టీమ్ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని పీఆర్ టీమ్ చెప్పినట్లు సమాచారం.