పంటల బీమా పేరిట జగన్ రైతులను నిండా ముంచారు: జీవీ
రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదని ఎమ్మెల్యే జీవీ అంజనేయులు అన్నారు. పంటల బీమా పేరిట జగన్ మొసలి కన్నీళ్లు కార్చడం మానాలని సలహా ఇచ్చారు. ఉచిత పంటల బీమా పేరిట రైతులను జగన్ నిండా ముంచాడన్నారు. బీమా సంస్థలకు రూ.1,300 కోట్లకుపైగా బకాయిలు పెట్టారని విమర్శించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఉచిత పంటల బీమా కల్పించామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎంతో మంది రైతులను ఆత్మహత్యల ఊబిలోకి నెట్టారని ఆయన మండిపడ్డారు.