AP: ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో దారుణ ఘటన జరిగింది. జగ్గవరపు వెంకటరెడ్డి (45) అనే వ్యక్తి పొలంలో గడ్డి కోశాడని ఓ వృద్ధురాలు చెప్పిందని.. కత్తితో దాడి చేశాడు. దాడి చేసే సమయంలో అడ్డువచ్చిన కొడుకు గోలి హరిరెడ్డి వికలాంగుడుని సైతం కొట్టినట్లు తెలుస్తోంది. స్థానికులు ఇద్దరిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.