ఝార్ఖండ్‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా.. తొలిసారిగా 67.74శాతం పోలింగ్ నమోదయ్యింది. ఇక్కడ నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. అధికార JMM మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా, విపక్ష ఎన్డీయే కూడా విజయం తమదేనని చెబుతోంది.