మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. మహారాష్ట్రలో అసెంబ్లీ పోరు హోరాహోరీగా సాగగా.. సీఎం ఎవరు కానున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలతోపాటు నాందేడ్ లోక్‌సభకు ఇటీవల ఓటింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా తాజా ఎన్నికల్లో 66.05 శాతం పోలింగ్ నమోదైంది.