Top 10 viral news 🔥
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లపై అసభ్యకర పోస్టులు పెట్టిన 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడ జిల్లా తునిలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువత ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు.