కేసీఆర్ అసెంబ్లీకి రా.. చూస్తా నీ సంగతి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. 'ఆయన అసెంబ్లీకి ఇప్పుడు వస్తారో చెప్పాలి. అప్పుడే రుణమాఫీపై చర్చ పెడుదాం. కాస్కో కేసీఆర్.. ఇక చూసుకుందాం. తెలంగాణలో తిరిగి కేసీఆర్ అనే మొక్కను పెరగనీయను. KCRను గద్దె దించుతానని చెప్పా.. దించిన. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా అని చెప్పాం.. చేశాం' అని ఫైర్ అయ్యారు.