క్రికెట్లో ధోని శకం మొదలైంది ఈ మ్యాచ్‌తోనే! (వీడియో)
మహేంద్రసింగ్ ధోని సరిగ్గా ఇదే రోజు అంటే 2005 అక్టోబర్ 31న క్రికెట్ రంగంలో విధ్వంసం సృష్టించాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ కొత్త అధ్యయానికి తెరలేపాడు. శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విధ్వంసకరం అంటే ఎంటో ప్రపంచానికి రుచి చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దిగిన సచిన్ వికెట్‌ను కోల్పోవడంతో.. వెంటనే రంగంలోకి దిగిన ధోని 299 పరుగుల లక్ష్యఛేదనలో 145 బంతుల్లోనే 183* రన్స్ తీశారు.