సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేవడియాలో గురువారం ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని
మోదీ నివాళులర్పించారు. ‘భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నివాళి. దేశం ఐక్యత, సార్వభౌమత్యాన్ని రక్షించడం అతని జీవితంలో అత్యంత ప్రాధాన్యత. ఆయన వ్యక్తిత్వం, పని దేశంలోని ప్రతీ తరానికి స్పూర్తినిస్తూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.