మరోసారి పోలీసులకు షాకిచ్చిన RGV
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి పోలీసులకు షాకిచ్చారు. సోమవారం ఒంగోలు పోలీస్ స్టేషన్లో జరగనున్న విచారణకు హాజరుకాలేనని లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం పంపారు. దాంతో ఆర్జీవీ వ్యవహారంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయనను అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్జీవీ నివాసానికి ప్రకాశం పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాలి. కాగా, చంద్రబాబు, పవన్‌పై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఆర్జీవీ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.