Mar 18, 2025, 17:03 IST/
దివ్యాంగరాలుకి సారీ చెప్పిన మంత్రి లోకేశ్
Mar 18, 2025, 17:03 IST
AP: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సారీ చెప్పారు. నంద్యాలకు చెందిన దివ్యాంగురాలు రాజేశ్వరీకి పది పరీక్షలు రాసేందుకు పాఠశాల మొదటి అంతస్థులో పరీక్షా గదిని కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ రూంల్లో రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తల్లి వేడుకున్నా అధికారులు అనుమతించలేదు. దీంతో కుమార్తెను ఎత్తుకుని కష్టపడి వెళ్తున్న ఫొటో బయటకు రాగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది మంత్రి లోకేశ్ దృష్టికి వెళ్లడంతో.. సారీ చెప్పి, వెంటనే ఏర్పాట్లు చేయాలన్నారు.