రామచంద్రపురంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రామచంద్రపురం షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఘనంగా జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి సెక్రెటరీ, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ ఘని విచ్చేసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రజలు కరోనాతో చాలా బాధ పడుతున్నారని అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుని స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గం టిఆర్ఎస్ మైనారిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, టిఆర్ఎస్ నాయకులు షేక్ అబ్దుల్ ఖాదీర్, వినోద్ నాయక్, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.