ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి: షర్మిల
AP: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టించారని మండిపడ్డారు. పోలీసులు సైతం నిర్ధారణకు వచ్చారని, కానీ ఆయనను కస్టడీలో తీసుకుని ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో అవినాష్‌ను విచారించి అరెస్ట్ చేయాలన్నారు.