దర్గాకు వెళ్లిన రామ్‌చరణ్‌.. విమర్శలకు ఉపాసన రిప్లై

64చూసినవారు
దర్గాకు వెళ్లిన రామ్‌చరణ్‌.. విమర్శలకు ఉపాసన రిప్లై
టాలీవుడ్ స్టార్ రామ్‌చరణ్ కడప దర్గాను సందర్శించడంపై వస్తున్న విమర్శలపై ఆయన భార్య ఉపాసన కొణిదెల స్పందించారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన ఉపాసన.. "దేవుడిపై విశ్వాసం అందరిని ఏకం చేస్తుంది. చిన్నాభిన్నం చేయదు. భారతీయులుగా మేము అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మా బలం ఉంది. రామ్‌చరణ్‌ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తుంటారు" అని రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్