Top 10 viral news 🔥
ఏపీలో దారుణం.. మహిళ ముఖం ఛిద్రం చేసి హత్యచారం
ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా కత్తెరగండ్లలో గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళ మృతదేహంపై బట్టలు లేకపోవడంతో లైంగిక దాడి చేసి, హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ ఆనవాలు తెలియకుండా ముఖాన్ని దుండగులు ఛిద్రం చేశారని పోలీసులు తెలిపారు. మహిళ వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చని పోలీసుల అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.