కులగణన సర్వే వివరాలను గోప్యంగా ఉంచుతాం: డిప్యూటీ సీఎం (వీడియో)
TG: అసమానతలు లేని సమాజ నిర్మాణమే తమ లక్ష్యం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం ఆయన హైదరాబాద్ ప్రజాభవన్లో మీడియాతో మాట్లాడారు. కులగణన సర్వే చేపట్టిన తర్వాత ఆ సమాచారాన్ని అంతా డిజిటలైజ్ చేస్తామన్నారు. ఈ సర్వేలో సేకరించిన కుటుంబాల సమాచారాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూల్లను జాగ్రత్తగా భద్రపరుస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.