దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నటుడు మిథున్ చక్రవర్తిపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన ఓ సమావేశంలో మిథున్ చక్రవర్తి ప్రసంగిస్తూ రెచ్చగొట్టే ప్రకటన చేశారని పోలీసులు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు హింస, ఉద్రిక్తతను పెంచేలా ఉన్నట్లు FIRలో పేర్కొన్నారు. దీంతో ఈ సినీ సూపర్‌స్టార్‌పై కేసు నమోదు అయింది. కొన్నేళ్లుగా బీజేపీలో కీలక నేతగా ఆయన సేవలందిస్తున్నారు.