ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం (వీడియో)
AP: ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని ఓ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రి స్టోర్ రూమ్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దాంతో ఆస్పత్రిలోని రోగులు, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్టోర్ రూమ్లో ఉన్న ఫైళ్లు దగ్ధం అయినట్లు సిబ్బంది తెలిపారు.