BIG BREAKING: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ (వీడియో)
హీరో అల్లు అర్జున్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ వచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేశారు.