జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

80చూసినవారు
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
AP: జగన్ అక్రమాస్తుల కేసుల బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కేసుల స్టేటస్ వివరాలు నిన్న సాయంత్రం ఫైల్ చేసినట్లు సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. సీబీఐ దాఖలు చేసిన స్టేటస్ రిపోర్ట్ కాపీ తాము పరిశీలిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం పేర్కొంది. తాము కూడా చూడటానికి కొంత సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. జనవరి 10న తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్