గురుకుల విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనం పెట్టడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కొండపాక మండల కేంద్రంలోని రుద్రేశ్వరాలయాన్ని సందర్శించి, పూజలు చేసి, ప్రాంగణంలో మంత్రి మొక్క నాటారు. విద్యార్థులకు సంబంధించిన అంశాన్ని ప్రతిపక్షాలు రాద్దాంతం చేయెద్దని సూచించారు. ఏవైనా పొరపాటు ప్రతిపక్ష నాయకుల దృష్టికి వస్తే తనకు తెలపాలన్నారు.