రేపు ఆవర్తనం.. ఉరుములు మెరుపులతో వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 6, 7 తేదీల్లో అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. దీని వల్ల రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.