AP: తిరుపతి జిల్లా తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం ఎక్కిన క్రాస్ వీల్.. ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. తిరుపతికి చెందిన లోకేశ్వరి (25), గౌతమి స్నేహితులు. ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు శిల్పారామం వచ్చారు. అక్కడే క్రాస్ వీల్ ఎక్కారు. వీరు కూర్చున్న సీటు 20 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఊడి కింద పడింది. లోకేశ్వరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా.. గౌతమికి గాయాలయ్యాయి.