Apr 10, 2025, 12:04 IST/
మావోయిస్టుల లేఖపై స్పందించిన ములుగు ఎస్పీ
Apr 10, 2025, 12:04 IST
మావోయిస్టుల లేఖపై ములుగు SP శబరీష్ స్పందించారు. కర్రె గుట్టలపై బాంబులు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటనలో విడుదల చేశారని తెలిపారు. చట్టవిరుద్ధ పనులు చేస్తున్న మావోయిస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అడవి ఉత్పత్తులపై ఆధారపడి ఆదివాసులు బతుకుతున్నారని, ఆదివాసీల జీవనోపాధిని అడ్డుకోవడం నేరమని చెప్పారు. ప్రజలు భయపడొద్దని.. ఆదివాసుల క్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేస్తామన్నారు. కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశామని తెలిపారు.