Apr 09, 2025, 17:04 IST/
రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ గెలుపు
Apr 09, 2025, 17:04 IST
IPL-2025లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో RR విఫలమైంది. రాజస్థాన్ 19.2 ఓవర్లలో కేవలం 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. RR బ్యాటర్లలో హెట్మెయర్(52), సంజు శాంసన్(41), రియాన్ పరాగ్(26) మాత్రమే పర్వలేదనిపించారు. GT బౌలర్లలో ప్రసిద్ కృష్ణ 3, రషీద్ ఖాన్, సాయి కిషోర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.