ప్రముఖ నటుడు జయశీలన్ కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు జయశీలన్ (40) అనారోగ్య కారణాలతో కాసేపటి క్రితమే కన్నుమూశారు. కామెర్లు వ్యాధి బారిన పడడంతో గత కొన్ని రోజులుగా చెన్నైలోని స్టాన్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇతను విజయ్‌తో బిగిల్, విజయ్ సేతుపతితో విక్రమ్ వేద, ధనుష్ పుదుపేట్టై మూవీస్‌లో సహాయనటుడిగా నటించారు. ఇతడు తన సినీ జీవితంలో 100కు పైగా సినిమాల్లో నటించారు.