ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్‌!

63చూసినవారు
ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌.. ఆ దేశంలో ఇదో కొత్త ట్రెండ్‌!
జపాన్‌ యువత కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’ ధోరణి వైపు అడుగులు వేస్తోంది. ప్రేమ లేదా లైంగిక సంబంధానికి తావు లేకుండా ఉండేదే ‘ఫ్రెండ్‌షిప్‌ మ్యారేజ్‌’. భాగస్వామి పరస్పర ఆసక్తులు, విలువల ఆధారంగా వారితో కలిసి జీవించడం అన్నమాట. వీళ్లు చట్టపరంగా దంపతులే అయినప్పటికీ. ప్రేమ, శృంగారానికి దూరంగా ఉంటారట. పిల్లలు కావాలనుకుంటే కృత్రిమ గర్భధారణ విధానాల ద్వారా ప్రయత్నిస్తారు.