ఈవీఎంలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు
ఈవీఎంలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈవీఎంల వల్ల ట్యాంపరింగ్ జరుగుతుందని, పేపర్ బ్యాలెట్ తీసుకురావాలని ఓ వ్యక్తి సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిని సుప్రీం తోసిపుచ్చి, "మీరు అనుకున్న వారు గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు కాదు, మీరు అనుకున్న వారు గెలవకుంటే ట్యాంపరింగ్ చేసినట్టా" అని సుప్రీం కోర్టు ప్రశ్నించి, పిటిషన్ ను కొట్టేసింది.