ప్రభుత్వ విద్యాసంస్థలలో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోందని దీనిని నిరసిస్తూ ప్రోగ్రెస్సివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనిటీ (పిడిఎస్యూ) ఆధ్వర్యంలో శనివారం జరిగే ప్రభుత్వ విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని పీడీఎస్యు రాష్ట్ర సహయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు.